గ్రేటర్ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

రాచకొండ సీపీ మహేష్ భగవత్

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్  పరిధిలో ఏడు  జీహెచ్ఎంసీ సర్కిళ్లు ఉన్నాయని.. ఈ ఏడు సర్కిల్స్ పరిధిలో 30 డివిజన్లు,  13 పోలీస్ స్టేషన్లు.. 14.2లక్షల వోటర్లు నమోదై ఉన్నారని ఆయన వివరించారు.

రాచకొండ పరిధిలో 12 అత్యంత సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్,  53 పోలింగ్ స్టేషన్స్ ను గుర్తించామన్నారు. 166 సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్ 512 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయన్నారు. ఈ పోలింగ్ లొకేషన్లను కవర్ చేయడానికి 104 రూట్ మొబైల్స్ ఏర్పాటు చేశఆమని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. 6 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, ఆరు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ లు.. 24 గంటలు నిరంతరం పనిచేస్తాయన్నారు. 533 అభ్యర్ధులు నామినేషన్లు వేసిన రాచకొండ పరిధిలో 6 కౌంటింగ్ సెంటర్లు ఉన్నాయన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి 8 వేల సివిల్ పోలీసులు మరియు 2వేల సాయుధ పోలీసులు ఉన్నారని.. అన్నీ పోలింగ్ లొకేషన్స్ జియో ట్యాగ్ చేసి మూడంచెల భద్రత తో పర్యవేక్షిస్తున్నామని సీపీ వివరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ముందు జాగ్రత్తగా 353 లైసెన్స్డ్ ఆయుధాలు డిపాజిట్ చేసుకున్నామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.

Read More News…

టామ్ అండ్ జెర్రీ మళ్లీ వచ్చేశారు.. అలరిస్తున్న ట్రైలర్

మొబైల్ డేటా వినియోగించాడంటూ తమ్ముడిని హత్య చేసిన అన్న

కరోనా టెస్టులు చేయించుకున్న తర్వాతే  ప్రచారం చేయాలి

రీసెర్చ్ : అమ్మాయిలకు బట్టతల మన్మథులంటేనే ఇష్టం

Latest Updates