సిర్పూర్ పేపర్ మిల్లులో ప్రమాదం..ముగ్గురు కార్మికులు మృతి

కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో  ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి  విద్యుత్ ప్లాంట్ కోసం  తవ్వకాలు జరుపుతుండగా మట్టిపెల్లలు కూలాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇంకా పలువురు కార్మికులు మట్టి కుప్పల కింద ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దాదాపు 50 మీటర్ల లోతులో కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు రాత్రి నుంచి కార్మికులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Latest Updates