ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం.. తాత గుండెలపై కూర్చొని కన్నీరు మున్నీరైన 3ఏళ్ల బాలుడు

జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఉగ్రవాదుల దాడిలో తన తాత చనిపోవడంతో మూడేళ్ల మనవుడు బాధితుడి గుండెలపై కూర్చొని ఏడ్వడం పలువురిని కంటతడి పెట్టిస్తుంది.

శ్రీనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని బారాముల్లా జిల్లా సోపోర్‌లో ఓ వ్యక్తి తన మనవడితో కలిసి కారులో శ్రీనగర్ నుంచి హంద్వారాకు వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో సోపోర్ వద్ద సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ వాహనంపై ఉగ్రవాదులు దాడిచేశారు.  విచక్షణారహితంగా కాల్పులు జరిపి బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో ఇద్దరు జవాన్లు వీరమణం పొందగా.. కారులో ఉన్న పెద్దాయన తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు జరిగే సమయంలో బాధితుడితో పాటు ఉన్న మరో మూడేళ్ల మనవడిని తూటాల బారిన పడకుండా  సీఆర్పీఎఫ్ జవాన్లు కాపాడారు.

ఈ సందర్భంగా  ఆ బాలుడ్ని సురక్షితంగా ఓ జవాన్ తీసుకొచ్చినట్టు కశ్మీర్ పోలీసులు ట్విట్టర్‌లో వెల్లడించారు. సోపోర్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి మూడేళ్ల బాలుడ్ని పోలీసులు రక్షించారు’ అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

Latest Updates