పదో తరగతి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు యువకులు

మైనర్ బాలిక ఫోటోలు మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. జీడీమెట్ల పరిది అయోద్యనగర్ లో ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కావడంతో బాలికకు సెల్ ఫోన్ కొనిచ్చారు కుటుంబ సభ్యులు. ఇన్ స్టాగ్రమ్ లో పరిచయం అయిన ముగ్గురు యువకులు బాలిక ఫోటోలతో  బ్లాక్ మెయిల్ చేసి నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నారు.  ఎలిశా, కిషోర్ ,రాంవికాస్ అనే ముగ్గురు యువకులు  డబ్బుల కోసం ఈనెల 14న బాలిక ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులు గమనించి వారిని ప్రశ్నించడంతో 10 తరగతి మెటీరియల్ కోసం వచ్చామని చెప్పారు యువకులు. ఇంట్లో డబ్బులు మాయమవుతుండడంతో కుటుంబ సభ్యులు బాలికను ప్రశ్నించారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్   చేస్తూ డబ్బులు తీసుకున్నట్లు అసలు విషయం చెప్పింది బాలిక. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆ ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు.

సభలో అంత ఇబ్బంది ఉంటే బయటకెళ్లి రండి

రాష్ట్రంలో ఇంకా బానిసత్వ పాలన

దేశంలో ఒక్కరోజే 97 వేల కేసులు..6 కోట్లు దాటిన టెస్టులు

Latest Updates