ట్రంప్ పై కి ఫోన్ విసిరాడు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు పరాభవం ఎదురైంది. అమెరికాలోని ఇండియానా పోలీస్ ప్రాంతంలో జరిగిన నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడేందుకు ట్రంప్ వేదికపైకి వస్తుండగా ఓ వ్యక్తి ఆయనపై కి ఫోన్ విసిరాడు. అయితే అది ట్రంప్ కు తగలలేదు. ఆయనకు కొద్ది దూరంలో వేదికపై పడింది. వెంటనే అలర్టైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. తర్వాత ట్రంప్ యధావిధిగా తన ప్రసంగం కొనసాగించారు. ట్రంప్ మాట్లాడుతున్నంత సేపూ ఆ ఫోన్ వేదికపై అలాగే ఉంది. మద్యం మత్తులో ఆ వ్యక్తి ట్రంప్ పైకి పోన్ విసిరాడని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతని పేరు విలియమ్ రోస్ గా తెలిపారు.

Latest Updates