ఆమెను పెళ్లి చేసుకున్నందుకు థ్రిల్లింగ్ గా ఉంది: నిఖిల్

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటి వాడయ్యాడు. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ పల్లవి శర్మను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. తన జీవితంలోని ప్రేమను ఫైనల్ గా పెళ్లి చేసుకున్నందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉందని నిఖిల్ ఆనందం వ్యక్తం చేశాడు. శామీర్ పేటలోని ఫామ్ హౌస్ లో కొందరు బంధువుల మధ్య ఈ పెళ్లి జరిగింది. పల్లవి సంప్రదాయ పట్టు చీరలో మెరవగా.. నిఖిల్ షేర్వాణీలో ఆహా అనిపించాడు.

‘నాకు విషెస్ పంపిన అందరికీ కృతజ్ఞతలు. చాన్నాళ్ల నుంచి ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా. మొత్తానికి మ్యారీడ్ మెన్ క్లబ్ లో నేనూ జాయిన్ అయ్యా’ అని నిఖిల్ చెప్పాడు.

‘వైభవంగా జరిగే పెళ్లి కంటే కూడా ఒకరికి మరొకరు తోడుగా ఉండటమే చాలా ముఖ్యం. ఒకవేళ గుడిలో మేం ఇద్దరమే ఉన్నా సరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే’ అని గత నెలలో ఓ ఇంటర్వ్యూలో నిఖిల్ పేర్కొన్నాడు.

హ్యాపీడేస్, స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం లాంటి మూవీస్ తో నిఖిల్ మంచి పాపులారిటీ సంపాదించాడు. నిఖిల్ నటిస్తున్న కార్తికేయ–2, 18 పేజెస్ సినిమాల షూటింగ్స్ కరోనా కారణంగా ఆగిపోయాయి.

Latest Updates