దేశ భక్తిగీతాలతో చైనాకు వార్నింగ్..భారత్ కు మద్దతిస్తున్న టిబెటన్ సైనికులు

టిబెటన్ సైనికులు భారత్ కు అండగా నిలుస్తున్నారు. టిబెటన్ దేశ భక్తిగీతాలను ఆలపించిన సైనికులు భారత్ కు మేమున్నామంటూ డైరక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టిబెటన్ సైనికుల తీరుపై భారత్ లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

తూర్పు లడఖ్‌లో టిబెటన్ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్‌ఎఫ్ఎఫ్) సైనికులు..,గాల్వన్ లోయలో చైనా చర్యలకు ప్రతీకారం తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. ఇండియాకు మద్దతిస్తూ  దేశభక్తి గీతాల్ని పాడుతున్నారు. హిందీలో నేను టిబెట్ నివాసిని,ఇండియా మా సొంత దేశమని భావిస్తున్నామంటూ టిబెటన్ సైనికులు పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టిబెటన్ సైనికులు చైనా పై ప్రతీకారం తీర్చుకుంటామని, తమ దేశాన్ని హస్తగతం చేసుకున్న భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Latest Updates