ఓటెయ్యకపోతే మిమ్మల్ని కుక్కలు కూడా చూడవు: తుమ్మల

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో మాజీమంత్రి , TRS సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. పాలేరులో మీరు వేసిన ఓట్లు మురిగి… మురుగు కాల్వలో కొట్టుకు పోయాయన్నారు. తనకు జరిగినట్లు ఎంపీ అభ్యర్థి నామాకు జరిగితే కుక్కలు కూడా మిమ్మల్ని చూడవన్నారు. 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంత చిన్నతనంగా తనకు ఎన్నడూ లేదన్నారు తుమ్మల.  జరిగిన పొరపాట్లు మర్చిపోయి నామాను గెలిపించాలన్నారు. గతంలో కూడా ఓ ప్రభుత్వ అధికారిపై నోరుపారేసుకుని అబాసుపాలయ్యారు . 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు…. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

Latest Updates