
సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం హైదరాబాద్ నగరాన్ని వణికించింది. అప్పటిదాకా మండే ఎండ ఉన్నా.. .కొద్ది నిమిషాల్లోనే వాతావరణం మారిపోయింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం.. నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. సిటీలో ట్రాఫిక్ స్తంభించి పోయింది. వర్షం కారణంగా పలు మెట్రో సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో గాలివాన బీభత్సం సృష్టించింది. చాలా ఎత్తులో ఉండటం.. రెండంతస్తుల స్టేషన్ కావడంతో… ఇక్కడ ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా కనిపించింది. నిలబడినవారిని నెట్టేసేంత బలమైన గాలులు వీచాయి. స్టేషన్ లో ఒకట్రెండు చోట్ల రూఫ్ లు ఎగిరిపోయాయి. గాలుల ప్రభావానికి థర్మాకోల్ షీట్లు ఊడిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hyderabad Rains- Scenes from Ameerpet Metro station on Monday. #Hyderabad #Telangana @ltmhyd pic.twitter.com/hF4DQ17aU1
— Rishika Sadam (@RishikaSadam) June 4, 2019