అరకులోయలో వడగండ్ల వాన (ఫొటోలు)

విశాఖ : అరకులోయ పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా వడగళ్ల వర్షం కురుస్తోంది. వాతవరణంలో సడెన్ గా వచ్చిన మార్పులతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని జనం ఇబ్బందిపడుతున్నారు. బుధవారం ఉదయం నుంచి భారీస్థాయిలో ఇక్కడ అటవీ ప్రాంతంలో వడగండ్లు పడ్డాయి. 3, 4 గంటల పాటు రాళ్ల వాన పడింది. వడగళ్లతో వనమంతా తెల్లరంగు పర్చుకుంది.

మండే ఎండల్లో వాతావరణం చల్లబడటంతో అరకులోయలోని ఊళ్లు ముందు రిలాక్సయ్యాయి. కానీ.. వడగళ్ల వానతో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు స్థానికులు. వాహనాలు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి.

 

Latest Updates