టిక్ టాక్ స్టార్లకు నష్టం కోట్లలో..  

టాప్ 100 ఇన్‌‌ఫ్లూయర్స్‌‌కు రూ.120 కోట్లు లాస్

 ఐఐహెచ్‌బీ రిపోర్ట్ ‌లో వెల్లడి

 టాప్ స్టార్లకు ఏడాదికి రూ.6 కోట్లు

వెలుగు, బిజినెస్‌ డెస్క్: టిక్ టాక్ బ్యాన్ ఎంతో మంది స్టార్లను యూజర్లను ఆందోళనలో పడేసింది. టిక్‌‌టాక్‌‌కు బానిసలు అయినవారికి ఎంటర్‌‌టైన్‌‌మెంట్ కరువైంది. టిక్ టాక్ వీడియోలు చేస్తూ..యూజర్లను అలరించే స్టార్లకు ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బపడింది. టిక్ టాక్ బ్యాన్‌‌తో ఆ షార్ట్ వీడియో యాప్ స్టార్లకు పేరెంట్ సంస్థ  బైట్‌‌డ్యాన్స్ కు కోట్లలో నష్టం వాటిల్లుతుందని రిపోర్ట్ లు వచ్చాయి. బైట్‌‌డ్యాన్స్ సంస్థకు ఏకంగా రోజుకు 5 లక్షల డాలర్లు అంటే మూడున్నర కోట్ల వరకు నష్టం వాటిల్లనుందని ఈ కంపెనీ కోర్ట్‌ ఫైలింగ్‌‌లో తెలిపింది. అదేవిధంగా ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ బ్రాండ్స్(ఐఐహెచ్‌‌బీ) జరిపిన సర్వేలో.. టాప్ 100 ఇన్‌‌ఫ్లూయర్స్ ‌కు రూ.120 కోట్లనష్టం వాటిల్లనుందని వెల్లడైంది.

టిక్‌‌టాక్‌‌తో పాటు 59 చైనీస్ యాప్‌‌లను బ్యాన్‌‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిరయ్ణంతో  ఫైసల్ షేక్, జన్నత్ జుబైర్ లాంటి టిక్ టాక్ స్టార్లు భారీగా నష్టపోతున్నారని ఐఐహెచ్‌‌బీ తెలిపింది. టాప్ స్టార్లను చూసుకుంటే రియాజ్ అలీ ఏడాదికి టిక్‌‌టాక్ ద్వారా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు సంపాదనను ఆర్జిస్తున్నాడు. దీపికా పదుకొనే, శిల్పా శెట్టి లాంటి బాలీవుడ్ స్టా ర్లతో  కొలాబరేట్ అయి మరీ టిక్ టాక్ యూజర్లను  రియాజ్ అలీ అలరించాడు. దీంతో రియాజ్‌‌కు టిక్ టాక్‌‌లో మస్తు ఫాలోయింగ్ ఉంది.ఈఫాలోయింగ్‌‌తో సంపాదన కూడా అలానే వచ్చేది. ఇప్పుడు  ప్రభుత్వం తీసుకున్న బ్యాన్‌‌తో ఈ సంపాదనంతా పోతోంది. జన్నత్ జుబైర్ కూడా రియాజ్ అలీకి ఏమాత్రం తీసిపోకుండా ఏడాదికి రూ.5 కోట్ల నుంచి రూ.ఐదు న్నర కోట్ల వరకు సంపాదించింది. జుబైర్‌‌కు 27.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. షేక్‌‌కు 30.8 మిలియన్ ఫాలోవర్స్, ఖాన్‌‌కు 28 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. టిక్ టాక్‌‌లో ఫేమస్ అయిన తర్వాత జన్నత్ జుబైర్ సొంతంగా ఒక యాప్‌‌ను కూడా లాంఛ్ చేసుకుంది. జన్నత్ జుబైర్ రెహమని అధికారిక యాప్‌ ద్వారానే ఎక్కువ మంది ఫాలోవర్స్ ‌ను ఆమె తన సొంతం చేసుకుంది. ఆమె మేకప్, బ్యూటీ ఛానల్‌‌కు 15 లక్షల సబ్‌‌స్క్రయిబర్లు ఉన్నారు. టిక్ టాక్ బ్యాన్‌‌ తర్వాత జుబైర్‌ ‌ఈమేకప్ యాప్ ద్వారా సంపాదనను పెంచుకుంటోంది. కరోనా లాక్‌‌డౌన్ సమయంలోటిక్ టాక్ యాప్‌‌కు యూజర్ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో స్టార్ల సంపాదనా అంతకు ముందుకంటే బాగా పెరిగింది. కానీ ఈ మురిపెం ఎన్నో రోజులు నిలవకుండానే లాక్‌‌డౌన్ తర్వాత వెంటనే టిక్ టాక్ యాప్ బ్యాన్ అయిపోయింది.

టిక్ టాక్ స్టార్లకు డబ్బులెలా వస్తాయి..

టాప్ 10 టిక్ టాకర్లకు ఒక పిక్చర్ పోస్ట్ కు రూ.1,20,000 నుంచి రూ.1,50,000 వరకు మనీ వస్తాయి. జీఐఎఫ్‌ ‌పోస్ట్ కు రూ. లక్షన్నర వరకు ఇస్తారు. అయితే టాప్ 100 ర్యాంకర్‌‌కు మాత్రం ఈ మనీ రూ.5 వేలుగానే ఉంటుంది. టాప్ ర్యాంక్‌‌ను బట్టి పిక్చర్ పోస్ట్‌కు మనీ డిసైడ్ చేస్తారు. టిక్ టాక్ స్టార్లమనీ ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ ఫాలోవర్స్ లక్షల్లో ఉన్న వారికి ఈ ప్రతిఫలం తక్కువగానే ఉన్నట్టు ఐఐహెచ్‌‌బీ చీఫ్ మెంటర్ సందీప్ గోయల్ అన్నారు. ఇతర ప్లాట్‌‌ఫామ్‌‌లతో పోలిస్తే..యూట్యూ బ్‌‌లో కేటగిరీ ఏ ప్లేయర్‌‌కు నెలకు రూ.25 లక్షల వరకు వస్తుంది. ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో  నెలకు రూ.5లక్షలు ఉంది. టిక్‌‌టాక్‌‌పై వీరు పొందేదిరూ.3 నుంచి రూ.4లక్షలే. అయితే యూట్యూబ్ వీడియోలకు చాలా ఖర్చవు తుంది. కెమెరా వర్క్ ఉంటుంది. ఎడిటింగ్ చేసుకోవాలి. కంప్యూటర్ ఎఫెక్ట్స్ క్ట్ ఇవ్వాలి. దీనికి తగ్గట్టే రిజల్ట్స్ కూడా బాగుంటాయి. దీంతో బ్రాండ్లతో ఇంటిగ్రేషన్ కూడా కుదురుతుంది. యూట్యూబ్‌‌ పైన ఆడియన్స్ క్వాలిటీ చాలా మెరుగ్గా ఉంటుందని గోయల్ చెప్పారు. అయితే టిక్‌‌టాక్ బ్యాన్ కావడంతో, ఈ ఇన్‌‌ఫ్లూయర్స్ పరిస్థి తి ఎలా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టిక్‌‌ టాక్ ఆల్టర్నేటివ్‌‌గా ఉన్న ఇండియన్ యాప్ రోపోసో 50 మిలియన్ డౌన్‌‌లోడ్స్ తో లీడింగ్‌‌లోకి వచ్చేసింది. ఆ తర్వాత మిత్రోన్, చింగారి యాప్‌‌లు ఇప్పుడు టిక్ టాక్ స్టార్లను తమ వేదికపైకి ఆహ్వానిస్తున్నాయి.

టిక్‌ టాక్ స్టార్లు                ఫాలోవర్స్(కోట్లలో)                        ఇన్‌‌కమ్

రియాజ్ అలీ                   4.23                                          5 నుంచి 6 కోట్లు

ఫైసల్ షేక్                      3.08                                         4 నుంచి 4.5 కోట్లు

అరిష్ఫా ఖాన్                  2.08                                        4 నుంచి 4.5 కోట్లు

జన్నత్ జుబైర్                 2.76                                        5 నుంచి 5.5 కోట్లు

నిషా గురగైన్                   2.73                                       3 నుంచి 3.5 కోట్లు

అవెజ్ దర్బార్                  2.56                                      2.5 నుంచి 3 కోట్లు

సమీ ఓ సూద్                  2.41                                      2.5 నుంచి 3 కోట్లు

ప్రియాంక మోంగియా        2.23                                      1 నుంచి 1.5 కోట్లు

అవ్‌నీత్ కౌర్                    2.21                                     3 నుంచి 3.5 కోట్లు

గిమా అశి                        2.11                                     2 నుంచి 2.5 కోట్లు

Latest Updates