గెలిచే వారికే టికెట్లు.. !

పార్లమెంట్ ఎన్నికలకు నేతలను  రెడీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. దీనికోసం అన్ని రాష్ట్రాల PCC చీఫ్ లు, శాసనసభాపక్ష నేతలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు.  ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకోవాలని.. దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని నేతలను ఆదేశించారు.

ఈ భేటీకి రాష్ట్రం నుంచి PCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి రాహుల్ అడిగారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే.. పార్లమెంట్ ఎలక్షన్ కమిటీల ఏర్పాటు, అభ్యర్థుల ఎంపిక చర్చించినట్టు చెప్పారు. మేనిఫెస్టోలో ఏఏ అంశలు పెట్టాలో సూచించారన్నారు.

లోక్ సభ కు పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల నాయకుల వివరాలు నియోజకవర్గాల వారీగా.. రెండు, మూడు వారాల్లో అందజేయాలన్నారు. పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కేడర్ ను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం పెంచేలా కార్యక్రమాలు రూపొందించాలని నేతలకు సూచించారు.

Latest Updates