ఈత కొడుతూ టిక్​టాక్​ : యువకుడు మృతి

టిక్​టాక్​ మరో ప్రాణం తీసింది
చెరువులో ఈత కొడుతూ
మునిగిపోయిన యువకుడు

హైదరాబాద్ (పహాడిషరీఫ్​), వెలుగు: టిక్​టాక్​ వీడియో కోసం చెరువులో ఈత కొడుతూ అందులో మునిగి చనిపోయాడో యువకుడు. పహాడిషరీఫ్​ పోలీసుల కథనం ప్రకారం.. ధూల్​పేట్​గంగబౌళికి చెందిన పూజారి గీతాభాయి, ధన్​రాజ్​ సింగ్​లు దంపతులు. వీరి కొడుకు పవన్​సింగ్​(22) కారు డ్రైవర్. ఇతడు ఆదివారం సాయంత్రం ఫ్రెండ్స్​పూజారి రాజ్​కుమార్​, గుప్తా మహేష్​ కుమార్, సాయిబాబాలతో కలిసి జల్​పల్లిలోని ఉండాసాగర్​ చెరువుకు వెళ్లాడు.

చెరువులో ఈత కొడుతూ టిక్​టాక్​ వీడియో చేయాలని అనుకున్నారు. పవన్​తో పాటు మరో ఇద్దరు చెరువులో దిగగా, ఇంకో వ్యక్తి వీడియో తీశాడు.పవన్ ఈత కొడుతూ చాలా దూరం వెళ్లాడు. అలసిపోవడంతో తిరిగి రాలేక ‘కాపాడండి’ అంటూ కేకలు పెట్టాడు. దగ్గరికి వెళ్లే లోపే మునిగిపోయాడు. పోలీసులు డెడ్​బాడీని చెరువు నుంచి వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates