పనికి రాలేదని మైనర్ ను కట్టేసి కొట్టిండు

 

నిజామాబాద్ జిల్లాలో ఓ కాం ట్రాక్టర్ ఘాతుకం

పనికి రావడం లేదన్న అక్కసుతో పద్నాలుగేండ్ల పిల్లవాడిని ఓ కాంట్రాక్టర్​ చిత్రహింసలకు గురిచేశాడు. అతని కాళ్లను తాడుతో కట్టేసి రోడ్డుమీద గొర్రగొర్ర గుంజుకుపోయాడు. ఏడుస్తున్నా వినిపించుకోలేదు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మల్కాపూర్–ఎ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బాలయ్య అనే కాం ట్రాక్టర్​ అదే ఊరికి చెందిన మైనర్​ను తన వద్ద పనిలో పెట్టుకున్నాడు. పనికి సరిగా రావడం లేదని బుధవారం పిల్లవాడి ఇంటికి కాంట్రాక్టర్​ వెళ్లి ఇలా దాడికి పాల్పడ్డాడు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

‑ వెలుగు, నిజామాబాద్ క్రైమ్

Latest Updates