జూలో బాలుడిపై దూకిన పులి.. వీడియో వైరల్

ఐర్లాండ్ జంతు ప్రదర్శనశాలలో ఏడేళ్ల బాలుడిపై పులి దూకిన వీడియో వైరల్ అయ్యింది. ఐర్లాండ్‌కు చెందిన రాబ్ అనే వ్యక్తి తన కొడుకును తీసుకొని డబ్లిన్ జూకి వెళ్లాడు. అక్కడ బాబు పులితో ఫోటో దిగినట్లుగా ఫోజ్ పెట్టాడు. అంతలోనే పులి వెనక నుంచి వచ్చి బాలుడిపై దూకింది. ఆ వీడియో చూస్తే బాలుడు చచ్చాడే అనుకుంటాం. కానీ, అక్కడ అలా జరగలేదు, ఎందుకంటే.. బాలుడికి, పులికి మధ్యలో ఒక దట్టమైన గాజు పలక ఉంది. ఆ విషయం మనకు పులి బాలుడిపై దూకిన తర్వాత కానీ తెలియదు. వీడియోలో రాబ్, తన కొడుకుని కదలకుండా అలాగే ఉండమని చెప్పడం, వెనక నుంచి మెల్లగా వచ్చిన పులి అకస్మాత్తుగా బాలుడిపై దూకడం అన్నీ వీడియోలో రికార్డయ్యాయి. ఆ వీడియోని రాబ్ తన ట్విట్టర్ ఖాతాలో పులికి నా కొడుకు మెనుగా మారాడు అనే టైటిల్‌తో పోస్టు చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దారుణం: చెట్టుకు కట్టేసి కొట్టి.. నోట్లో మూత్రం పోసి..

Latest Updates