టూరిస్టులకు చెమటలు పట్టించిన పులి

‘పులితో ఫోటో దిగాలంటే కొంచెం రిస్కైనా పర్లేదు.. ట్రై చేయొచ్చు’ అనేది ఓ సూపర్ హిట్ సినిమా డైలాగ్. అలా అనుకొనే రిస్క్ చేసి దగ్గరలో ఉన్న  పులిని ఫోటో తీయబోయిన టూరిస్టులకు చెమటలు పట్టాయి. ఎదురుపడ్డ పులిని చూసి నోట మాట పడిపోయింది.  ఎక్కడ ఏ అడవిలో జరిగిందో తెలియదు కానీ.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ట్విటర్ లో  షేర్ చేశారు.

వీడియోలో కొందరు టూరిస్ట్ లు అత్యుత్సాహంతో అడవిలో దారి వెంట ఉన్న బౌండరీని దాటి,  పులులు ఉన్న ప్రదేశంలో వాటి ఫోటోలను తీయసాగారు. వారికి దగ్గరలో ఉన్న పులి చిత్రాలను కెమెరాలో బంధించుతున్న సమయంలో హఠాత్తుగా ఓ పులి వారి పక్కనే ఉన్న గోడపైకి జంప్ చేసి వారికి కొద్ది దూరంలో నిలబడింది. కెమెరాలో బంధించాలనుకున్న పులి.. కళ్లెదురుగా వచ్చేసరికి భయంతో ఆ టూరిస్టులు ఉలుకు పలుకు లేకుండా అలాగే మిన్నకుండిపోయారు. అయితే పులి మాత్రం వారిని ఏమీ చేయకుండా అలాగే గోడ పై  నడుచుకుంటూ వెళ్లింది

నందా ఈ వీడియోని షేర్ చేస్తూ..  టూరిస్టులు ఇలాంటి తెలివి తక్కువ పనులు మానుకోవాలని, ఈసారి పులి బారి నుండి బయటపడినట్టు మరో సారి జరగదని ట్వీట్ చేశారు.

Latest Updates