నల్లమల అడవిలో చిరుత మృతి

ఏపీ కర్నూలు జిల్లాలో చిరుత చనిపోయింది. ఆళ్లగడ్డ మండలం మెట్టపల్లి గ్రామ సమీపంలోని నల్లమల అడవిలో చిరుత మృతి చెందినట్టు గుర్తించారు స్థానికులు. చిరుత సంచరిస్తున్నట్టు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు పశుకాపరులు. అడవిలో పశువుల మేతకు వెళ్లిన స్థానికులు చిరుత మృతదేహాన్ని గుర్తించారు. తెలుగు గంగ కాలువ సమీపంలో కాలువలో చిరుత మృతదేహం పడి ఉందని చెబుతున్నారు. ఆహారం కోసం వేటాడుతూ చిరుత తీవ్రంగా గాయపడిందని తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే చిరుత చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. అటవీ అధికారుల సమక్షంలో ఘటనా స్థలంలోనే పోస్టు మార్టానికి ఏర్పాట్లు చేస్తున్నారు సిబ్బంది.

Latest Updates