జిమ్ లో హీరో తల్లి వర్కవుట్ .. 95 కేజీల బరువు ఎత్తిన అయేషా

బాలీవుడ్ , టాలీవుడ్ .. ఇలా ప్రతీ ఇండస్ట్రీలోనూ హీరోలంతా సిక్స్ ప్యాక్ లు ట్రై చేస్తూ.. సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తున్నారు. అయితే ఫిట్ నెస్ కోసం హీరోలు కసరత్తులు చేయడం కామన్.  కానీ ఓ హీరో తల్లి మాత్రం తన కొడుకు కంటే ఫిట్ నెస్ లో ఏ మాత్రం  తక్కువ కాదంటూ వర్కవుట్లు చేస్తోంది.  ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ కండల వీరుడు టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్.   ఏకంగా 95 కేజీల బరువుని ఎత్తి ఔరా అనిపించింది. జిమ్ లో చిరునవ్వుతో తాను చేసిన ఈ వెయిట్ లిఫ్టింగ్ వర్కవుట్ ని ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది.  ఈ వీడియో ని చూసిన పలువురు నెటిజన్లు ఆమె ఫిట్ నెస్ ప్రశంసిస్తున్నారు. 50 ఏండ్ల వయస్సులోనూ ఆమె శక్తిసామర్ధ్యలపై ఫిదా అవుతున్నారు.  టైగర్ ప్రియురాలు దిశా పటాని కూడా కామెంట్ రూపంలో అయేషాను ప్రశంసించింది. అసామాన్యమైన బలం అంటూ కామెంట్ చేసింది.

ఇదిలా ఉండగా టైగర్ ష్రాప్.. ప్రభాస్ సినిమాలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ మూవీ ఆదిపురుష్ లో టైగర్ లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్నాడట. కానీ దీని గురించి ఏ ప్రకటనా వెలువడలేదు. ప్రస్తుతం టైగర్ హీరోపంక్తి 2, గణపత్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.

Latest Updates