కాల్వ అడవిలో పెద్దపులి సంచారం

నర్సాపూర్ (జి) వెలుగు: జిల్లాలోని దిలావర్పూర్ మండలం కాల్వ అడవిలో పెద్దపులి సంచరిస్తున్నట్టు స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. గత వారం రోజుల కిందట ఒక లేగదూడ కూడా చంపేసిందని కాల్వ తండా గ్రామస్తులు తెలిపారు. చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండడంతో వ్యవసాయ పనులకు వెళ్లాలంటే తండావాసులు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనులు చేస్తుండగా బుధవారం అటు పక్కగా వెళ్తున్న పెద్ద పులి కంట‌ప‌డింది. దాన్ని చూసిన వారు కేకలు వేయడంతో భ‌యంతో అక్క‌డి నుంచి పరుగులు తీసింది. అక్కడ ఉన్న కొందరు వ్యవసాయ కూలీలు ఫోటోలు, వీడియో తీశారు.

tiger wandering in the calva forest in narsapur district

Latest Updates