ఆ పులికి కరోనా లేదు

  • టెస్ట్ ల్లో నెగిటివ్ గా తేలినట్లు ప్రకటించిన ఐవీఆర్ఐ

న్యూఢిల్లీ : ఢిల్లీ జూ లో చనిపోయిన ఆడపులికి కరోనా లేదని తేలింది. పులి కళేబరం నుంచి తీసిన శాంపిల్ ను టెస్ట్ చేయగా రిపోర్ట్ లు నెగిటివ్ గా వచ్చాయంటూ ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఐవీఆర్ఐ) తెలిపింది. కిడ్ని సంబంధిత సమస్యలతో ఆరోగ్యం క్షీణించి పులి చనిపోయిందన్నారు. శుక్రవారం ఢిల్లీ జూ లో ఆడపులి ఒకటి చనిపోవటంతో సిబ్బంది ఆందోళన చెందారు. కరోనా సోకటంతోనే పులి చనిపోయి ఉంటుందని అనుమానించారు. ముందు జాగ్రత్తగా కళేబరం నుంచి శాంపిల్ సేకరించి ఐవీఆర్ఐ కి పంపించారు. కరోనా అనుమానంతో పులి అంత్యక్రియలను కరోనా గైడ్ లైన్స్ కు అనుగుణంగా నిర్వహించారు. ఇటీవల న్యూయార్క్ లోని బ్రాంక్జ్ జూ లో 4 ఏళ్ల పులికి కరోనా సోకింది. హాంకాంగ్ లోనూ రెండు కుక్కులు కరోనా బారిన పడ్డాయి. దీంతో ఢిల్లీ జూ లో చనిపోయిన పులికి కూడా కరోనా వచ్చిందేమోనన్న అనుమానం కలకలం రేపింది. ఐతే టెస్ట్ ల్లో కరోనా నెగిటివ్ అని తేలటంతో అంతా రిలీఫ్ అయ్యారు.

Latest Updates