వీడియో: భీకర పోరు తర్వాత పులికి లొంగిన మరో పులి

ఒకదానితో ఒకటి తీవ్రంగా పొట్లాడుకున్న తర్వాత ఒక పులి మరో పులికి లొంగిపోయింది. ఎక్కడో తెలియదు కానీ ఒక నేషనల్ పార్కులో జరిగిన ఈ సన్నివేశాన్ని పర్యాటకులు డైరెక్ట్‌గా చూడటమే కాకుండా.. వీడియో కూడా తీశారు. ఆ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో లక్షకు పైగా లైకులను సాధించింది.

అడవిలో రెండు పులులు పక్కపక్కగా నడుస్తున్నాయి. ఉన్నట్టుండి ఒక పులి మరో పులిపైకి దాడికి దిగింది. రెండు పులులు నువ్వా.. నేనా అన్నట్లు కాసేపు పోట్లాడుకున్నాయి. కాసేపటి తర్వాత ఒక పులి వెనక్కి తగ్గింది. మెల్లగా కాళ్లపై కూర్చొని మరో పులికి లొంగిపోయింది. దాంతో శాంతించిన దాడి చేసిన పులి.. కాసేపు అటూఇటూ తిరిగి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోను క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ పేరుతో ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో తనకు వాట్సాప్ ద్వారా వచ్చిందని ఆయన తెలిపారు.

For More News..

దారుణం: డైనమైట్స్ లారీలో పేలుడు.. 15 మంది మృతి.. ఎగిరిపడ్డ శరీర భాగాలు

మార్టుల్లో కుళ్లిన ఫ్రూట్స్.. ఔట్ డేటెడ్ స్నాక్స్​

పీపీఈ కిట్ లో వచ్చి రూ.13 కోట్ల బంగారం కొట్టేసిన దొంగ

Latest Updates