ఆవుల్ని చంపి తిన్న పులికి ఏం శిక్ష వేస్తారు?: అసెంబ్లీలో చర్చ

గోవా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న లేవనెత్తారు. ప్రజలు ఆవుల్ని చంపి తింటే శిక్ష ఉన్నప్పుడు.. పులులను కూడా శిక్షించాలి కదా అంటూ డిమాండ్ చేశారు. దీనిపై సభలో చర్చించాలని కూడా కోరారు. బుధవారం ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో ఈ డిమాండ్ లేవనెత్తారు.

గత నెలలో మహదయి అభయారాణ్యానికి సమీపంలో ఓ రైతు ఇంట్లోని ఆవును పులి చంపి తినేసింది. దీంతో ఊరి జనమంతా కలిసి కర్రలతో కొట్టి ఓ ఆడ పులిని, మూడు పిల్లల్ని చంపేశారు. బుధవారం గోవా అసెంబ్లీలో ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్.. దీనిని ప్రస్తావించారు. వన్య జీవుల కోణంలో చూస్తే పులులు ఎంత ముఖ్యమో రైతులకు ఆవులు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ఆవుల్ని చంపి తింటే మనుషులకు శిక్ష వేసినప్పుడు ఇదే పని చేసే పులులకు కూడా శిక్ష ఏం శిక్ష వేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో మానవీయ కోణంతో చూడడం మర్చిపోకూడదని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగంబర్ కామత్ కూడా దీనిపై చర్చించాలన్నారు. సభలో అటెన్షన్ మోషన్‌కు పట్టుబట్టారు. దీనిపై స్పందించిన సీఎం ప్రమోద్ సావంత్.. పులులు తమ ఇళ్లపై దాడి చేయడంతో ప్రజలు వాటిని చంపారని అన్నారు. తమ ఆవులను కోల్పోయిన రైతులకు మూడు నాలుగు రోజుల్లో నష్ట పరిహారం అందజేస్తామని తెలిపారు.

Latest Updates