రామాలయ భూమి పూజకు భద్రతా చర్యలు వేగవంతం

న్యూఢిల్లీ: అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రామ మందిర భూమి పూజా కార్యక్రమం ఈ నెల 5న వైభవంగా జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో అధికారులు జాగ్రత్త చర్యలతోపాటు సెక్యూరిటీని పటిష్టం చేస్తున్నారు. ఆదివారం అయోధ్యకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెళ్లనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించనున్నారు.

‘ఆగస్టు 5న జరగనున్న రామ మందిర భూమి పూజ కార్యక్రమానికి అవసరమైన అన్ని సెక్యూరిటీ అరేంజ్‌మెంట్స్‌ చేస్తున్నాం. కొవిడ్ ప్రోటోకాల్స్‌ను ఫాలో అవుతున్నాం. ఒకే దగ్గర ఐదుగురికి మించి గుమికూడొద్దని అందరినీ కోరుతున్నాం. దీంతోపాటు ట్రాఫిక్ మూమెంట్‌ను కంట్రోల్ చేయడానికి 12 చోట్ల డైవర్షన్స్‌ చేస్తున్నాం’ అని అయోధ్య సీనియర్ సూపరిటంటిండెంట్ఆఫ్​ పోలీస్ (ఎస్ఎస్‌పీ) తెలిపారు. భూమి పూజకు ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో భద్రతను చూసుకోవడానికి కరోనా నెగిటివ్‌ వచ్చిన 45 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న వారిని నియమించారని సమాచారం. ఈ కార్యక్రమానికి కొన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులతోపాటు ఆర్‌‌ఎస్ఎస్ చీఫ్​ మోహన్ భగవత్ హాజరయ్యే చాన్సుంది.

Latest Updates