ఇంటర్ బోర్డ్ దగ్గర మళ్లీ టెన్షన్.. బారికేడ్లు, భారీగా బందోబస్త్

ఇంటర్ బోర్డు దగ్గర కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ ప్రతిరోజూ ఆందోళన, నిరసన తెలియజేస్తుండటంతో అక్కడ బందోబస్త్ భారీగా కల్పించారు పోలీసులు. ఈ ఉదయం ఇంటర్ బోర్డ్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇంటర్ బోర్డ్ కార్యాలయానికి మూడంచెల భద్రత కల్పించారు. బారికేడ్లతో బోర్డు కార్యాలయానికి వచ్చే దారిని మూసేశారు.

మరోవైపు… ఫిర్యాదులతో ఇంటర్ కార్యాలయానికి తరలివస్తున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు. ఐడీ కార్డులు చూపించిన వారికి మాత్రమే ఇంటర్ బోర్డ్ వైపు అనుమతిస్తున్నారు అక్కడి సిబ్బంది.

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్

విద్యార్థులకు మద్దతుగా.. ఇంటర్ బోర్డ్ దగ్గర నిరసన తెలిపేందుకు వచ్చిన నాగేశ్వర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్ బోర్డ్ ఆఫీస్ లోకి వెళ్లకముందే.. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వెహికల్ లోకి ఎక్కించారు.

Latest Updates