టిక్ టాక్ పిచ్చి: యువతి కోసం భర్తను వదిలేసిన మహిళ

టిక్ టాక్ పిచ్చి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. సోషల్ మీడియా వీడియో యాప్ లొ మరో యువతితో సన్నిహిత సంబంధాలు పెంచుకున్న వివాహిత.. భర్తను వదిలి వెళ్లిపోయింది. టిక్ టాక్ ను వదిలేయాలని భర్త మందలించడంతో అలిగి ఇద్దరు పిల్లలతో సహా కనిపించకుండా పోయింది. నాలుగు రోజులుగా అన్ని చోట్లా గాలించినా ఆచూకీ దొరకలేదు. ఆమెతో టిక్ టాక్ డ్యూయెట్లు చేసే బెంగళూరుకు చెందిన అంజలి అనే యువతిని ప్రశ్నించినా ఆమె ఆచూకీ తెలియలేదు. కర్నూలు జిల్లా ఆధోనికి చెందిన ఆ వివాహిత కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చెల్లెలి ఇంటికెళ్లినప్పుడు పరిచయం..
కర్నూలు జిల్లా ఆదోని కిలిచిపేటకు చెందిన యువతికి 12 ఏళ్ల క్రితం కర్ణాటకలోని కొప్పళకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు సంతానం. కొద్ది నెలలుగా ఈమె టిక్ టాక్ మోజులో పడిపోయింది. బెంగళూరులో ఉంటున్న తన చెల్లి ఇంటికి తరచూ వెళ్లే ఆమెకు అక్కడ అంజలి అనే యువతితో పరిచయం పెరిగింది. ఇటీవల టిక్ టాక్ వీడియోలు కలసి చేయడం అలవాటుగా మారింది. అంజలి అబ్బాయి వేషాలతో తన ప్రియుడిగా డ్యూయెట్లు చేస్తూ టిక్ టాక్ లో వీడియోలు పెట్టేవారు.
పుట్టింటికెళ్లి.. అక్కడి నుంచి..
ఏడాదిన్నరగా వీరిద్దరూ చాలా సన్నిహితంగా మెలగుతున్నట్లు భర్తకు తెలియడంతో రెండుసార్లు పెద్దలతో పంచాయతీ పెట్టించాడు. వాళ్లు సర్ది చెప్పినా ఆమె తీరులో మారకపోవడంతో నెల క్రితం భర్త గట్టిగా మందలించాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని ఆధోనిలోని పుట్టింటికి వెళ్లింది. యువతితో సన్నిహితంగా ఉంటున్న విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు తనకి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పుట్టింట్లోనూ ప్రశాంతత లేదని ఈ నెల 10న ఇంట్లో ఎవరూ లేని టైంలో పిల్లలతో సహా వెళ్లిపోయింది. ఆమె కోసం బంధువులందరినీ వాకబు చేసినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. పోలీసులు బెంగళూరుకు చెందిన అంజలి ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా ఆమె ఆచూకీ దొరకలేదు. ఆమె తన దగ్గరకు రాలేదని చెబుతోంది. అయితే తన భార్య ఆ యువతి దగ్గరకే వెళ్లిందని, ఆమె నిజం దాస్తోందని భర్త ఆరోపిస్తున్నాడు.

More News

సిటీలో మరో దారుణం.. చెల్లిని బెదిరించి అక్కపై అత్యాచారం
ఆడ, మగ అంగీకారంతోనే రేప్‌లు: పోలీస్ వివాదాస్పద వ్యాఖ్యలు
9 గంటల నిద్ర చాలా డేంజరే!
ప్రతిభగల విద్యార్థులకు ఎల్ఐసీ అందిస్తున్న ఆర్థిక సాయం

Latest Updates