టిక్ టాక్ లో వీళ్లను ఫాలో అవుతున్నారా…

tik-tok-celebrities

మన దగ్గర ఈ మధ్యే టిక్‌‌టాక్‌‌ బ్యాన్‌‌ అయ్యింది. వెంటనే మళ్లా వచ్చింది. ఆ వెంటనే లక్షల మంది డౌన్‌‌లోడ్‌‌ చేసుకున్నారు. ఇయ్యాల రేపు స్మార్ట్‌‌ ఫోన్‌‌ ఉంటే చాలు వీడియో తీసి.. టిక్‌‌టాక్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేస్తున్నారు. ఇక లైక్‌‌లు వచ్చినయ్‌‌ అనుకో.. ఎంత ఖుషీ అంటే..  ఆ ఆనందానికి హద్దులే ఉండయ్‌‌. టిక్‌‌టాక్‌‌కు ఎంత క్రేజ్‌‌ ఉందంటే.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల మిలియన్లకుపైగా జనాలు డౌన్‌‌లోడ్‌‌ చేసుకున్నారు. ఈ యాప్‌‌కే కాదు, అందులో వీడియోలు చేసేవాళ్లకూ అంతే క్రేజ్ ఉంది. అలా సెలబ్రిటీలు అయిన టాప్‌‌ టిక్‌‌టాక్‌‌ స్టార్స్‌‌ వీళ్లు.

మంజుల్‌‌ ఖట్టర్‌‌‌‌
టిక్‌‌టాక్‌‌లో ‘మేల్‌‌ క్రష్ ఆఫ్‌‌ ఇండియా’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడి వీడియోలను ఎక్కువమంది ఇష్టపడ్డానికి ముఖ్య కారణం ‘లిప్‌‌ సింక్‌‌’.   ఏ సీన్​ డబ్ చేసినా, ఏ పాటకు వీడియో చేసినా లిప్‌‌సింక్‌‌ కరెక్ట్‌‌గా ఉంటుంది.  మంచి సింగర్, గిటార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ కూడా. కామిక్‌‌ టైమింగ్‌‌ ఉన్న ఆర్టిస్ట్‌‌. మంజుల్‌‌ డ్రెస్సింగ్‌‌ సెన్స్‌‌ను ఇష్టపడే వాళ్లు కూడా ఎక్కువమందే ఉన్నారు.  మంజుల్‌‌.. తేజస్విని, మోనాల్‌‌ ఠాకూర్‌‌‌‌తో కలిసి తీసిన వీడియో సాంగ్‌‌ ‘షై మోరా సైయా’కు యూట్యూబ్‌‌లో 41 మిలియన్లకు పైగా వ్యూస్‌‌ వచ్చాయి. ముంజుల్‌‌ ఈ మధ్య రిట్స్‌‌ బదియానితో కలిసి చేసిన ఒక వీడియో సాంగ్‌‌  యూట్యూబ్‌‌లో 104 మిలియన్ల వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది. టిక్‌‌టాక్‌‌లో 11 మిలియన్ల ఫాలోవర్స్‌‌ ఉన్నారు.

ఫైజల్‌‌ షేక్
ఫైజల్‌‌ 19.2 మిలియన్ల ఫాలోవర్స్‌‌తో ‘టాప్‌‌ ఇండియన్‌‌ టిక్‌‌టాక్‌‌ స్టార్‌‌‌‌’గా పేరు తెచ్చుకున్నాడు. ఇతడు కామెడి వీడియోలతో టిక్‌‌టాక్‌‌ ప్రయాణం మొదలుపెట్టాడు. ఇప్పుడు మాత్రం అన్ని రకాల వీడియోలు చేస్తున్నాడు. అంతేకాకుండా ‘టీమ్‌‌07’ అనే టిక్‌‌టాక్‌‌ అకౌంట్‌‌లో మరో ఆరుగురు ఫ్రెండ్స్‌‌తో కలసి వీడియోలు చేస్తున్నాడు. ఇతడికి ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో కూడా 5.2 మిలియన్ల ఫాలోవర్స్‌‌ ఉన్నారు.

 

రియాజ్‌‌ అలీ
తక్కువ టైంలో పది మిలియన్ల ఫాలోవర్స్‌‌ మార్కును దాటిన టిక్‌‌టాక్‌‌ యూజర్‌‌‌‌. ప్రస్తుతం అలీకి11.9  మిలియన్ల ఫాలోవర్స్‌‌ ఉన్నారు. ఇతను టిక్‌‌టాక్‌‌లో మంచి కమెడియన్‌‌గా గుర్తింపు పొందాడు. డ్యాన్సింగ్‌‌ వీడియోలు కూడా చేస్తుంటాడు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇతడు ఉండేది భూటాన్‌‌లో కాకపోతే మన దేశానికి చెందినవాడు. ఇతడి హెయిర్ స్టైల్‌‌కు చాలామంది ఫ్యాన్స్‌‌ ఉన్నారు. రియాజ్‌‌ మిగతా టిక్‌‌టాక్‌‌ స్టార్స్‌‌తో కలిసి కూడా వీడియోలు చేస్తున్నాడు.

 

ఆషికా భాటియా
టిక్‌‌టాక్ ద్వారా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్లలో ఆషికా ఒకరు. ఈమెకు 8.7 మిలియన్‌‌ ఫాలోవర్స్‌‌ ఉన్నారు.  ఆషికా.. ‘మీరా’ అనే  హిందీ సినిమాలో లీడ్‌‌ రోల్‌‌లో నటించింది. సల్మాన్‌‌ఖాన్‌‌ హీరోగా వచ్చిన ‘ప్రేమ్‌‌ రతన్ ధన్ పాయో’ సినిమాలో
కూడా హీరో చెల్లి ‘రాజకుమారి రాధిక’ పాత్రలో నటించింది.

 

అవ్‌‌నీత్‌‌ కౌర్‌‌‌‌
ఫేమస్‌‌ డ్యాన్స్‌‌ షో ‘డ్యాన్స్‌‌ ఇండియా డ్యాన్స్‌‌’ లిటిల్‌‌ మాస్టర్స్‌‌–2010లో ఫైనల్స్‌‌ వరకు వెళ్లిన ముగ్గురిలో కౌర్‌‌‌‌ ఒకరు. ఈమె డ్యాన్సరే కాదు, మంచి యాక్ట్రెస్‌‌ కూడా. ఇప్పుడు మాత్రం పెద్ద టిక్‌‌టాక్‌‌ స్టార్‌‌‌‌. ఈమెకు 12  మిలియన్ల  ఫాలోవర్స్‌‌ ఉన్నారు. కౌర్‌‌‌‌ ‘డాన్స్‌‌ కే సూపర్‌‌‌‌ స్టార్స్‌‌’, జలక్ దిక్‌‌లాజా’ లాంటి డ్యాన్సింగ్‌‌, రియాలిటీ షోస్‌‌లో కూడా పాల్గొంటోంది. కొన్ని టీవీ సీరియళ్లలో కూడా నటించింది. 2014లో రిలీజ్‌‌ అయిన ‘మర్దానీ’తో సినిమాల్లో కూడా అరంగేట్రం చేసింది. ఈ మధ్యే ‘సబ్‌‌’ చానెల్‌‌లో  ప్రసారమైన ‘అలాద్దీన్‌‌’ సీరియల్‌‌లో కూడా నటించింది.

 

జన్నత్‌‌ జుబైర్‌‌‌‌ రహ్‌‌మాని
ఈమె టిక్‌‌టాక్‌‌ స్టార్‌‌‌‌ మాత్రమే కాదు, నటి కూడా. సినిమాలు, సీరియళ్లలో నటిస్తోంది. కానీ.. జన్నత్‌‌ గురించి టిక్‌‌టాక్‌‌ ద్వారానే ఎక్కువ మందికి తెలిసింది. 2009లో తన యాక్టింగ్‌‌ కెరీర్‌‌‌‌ను మొదలు పెట్టింది. 2011లో కలర్స్‌‌ టీవీలో ప్రసారమైన ‘పుల్వా’ ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య రిలీజ్ అయిన ‘హిచ్కీ’ సినిమాలో ‘నటాషా’ పాత్రలో నటించి మెప్పించింది. అంతేకాదు ‘ముంబై అఛీవర్స్‌‌ అవార్డ్స్‌‌’ వేడుకల్లో ‘ఉత్తమ యువనటి’గా ఎంపికైంది. ఈమెకు టిక్‌‌టాక్‌‌లో 17.8  మిలియన్లు, ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో 6.8 మిలియన్ల ఫాలోవర్స్‌‌ ఉన్నారు.

 

హస్‌‌నైన్‌‌  ఖాన్‌‌
ఇతడిని ‘ఎక్స్‌‌ప్రెషన్‌‌ కింగ్‌‌ ఆఫ్ టిక్‌‌టాక్‌‌’ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఎలాంటి భావాన్ని అయినా పలికిస్తాడు హస్‌‌నైన్‌‌. కామిక్‌‌ టైమింగ్‌‌, లిప్‌‌ సింక్‌‌ ఉండే ఆర్టిస్ట్‌‌. అంతేకాదు ఇతడు ‘టీమ్‌‌07’లో కూడా మెంబర్‌‌‌‌గా కొనసాగుతున్నాడు. అన్ని రకాల వీడియోలు చేస్తున్నాడు. ఇతడ్ని 10.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. హస్‌‌నైన్‌‌కు ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో 3.4 మిలియన్ల ఫాలోవర్స్‌‌ ఉన్నారు.

 

అవెజ్‌‌ దర్బార్‌‌‌‌

‘ఏసీఈ ప్రొడక్షన్​’ కంపెనీ ఫౌండర్‌‌‌‌, డైరెక్టర్‌‌‌‌. కొరియోగ్రాఫర్‌‌‌‌, డ్యాన్సర్‌‌‌‌ కూడా. ప్రస్తుతం అవెజ్‌‌కు టిక్‌‌టాక్‌‌లో 11.1 మిలియన్లు, ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఒక మిలియన్‌‌ ఫాలోవర్స్‌‌ ఉన్నారు. టిక్‌‌టాక్‌‌(మ్యూజికల్లీ) ఇచ్చే ‘డ్యాన్సింగ్‌‌ అండ్‌‌ టాలెంట్’ బ్యాడ్జ్‌‌  కూడా సొంతం చేసుకున్నాడు. ఎక్కువగా కామెడీ, లిప్‌‌ సింక్‌‌ వీడియోలు పోస్ట్‌‌ చేస్తుంటారు. ఇతడికి ఒక యూట్యూబ్‌‌ చానెల్‌‌ కూడా ఉంది. అందులో డ్యాన్స్‌‌ వీడియోస్‌‌ అప్‌‌లోడ్‌‌ చేస్తుంటాడు.

గరిమా చౌరాసియా
ఒక్క వీడియోతో స్టార్‌‌‌‌ అయిపోయింది. గరిమా తన ఫ్రెండ్‌‌ రుగీస్వినీతో కలిసి ఒక వీడియో సాంగ్‌‌ చేసింది. అది సోషల్‌‌ మీడియాలో బాగా వైరల్‌‌ అయ్యింది. దాంతో ఒక్కసారిగా గరిమా ఫాలోవర్స్‌‌ సంఖ్య పెరిగిపోయింది. ఆ ఒక్క వీడియోతోనే ఆమె స్టార్‌‌‌‌ అయ్యింది. ఆ తర్వాత కూడా చాలా వీడియోలు చేసింది గరిమా. ఈమెకు 9.9 మిలియన్ల ఫాలోవర్స్‌‌ ఉన్నారు.

 

అద్నన్‌‌ షేక్
మల్టీ ట్యాలెంటెడ్‌‌ టిక్‌‌టాక్‌‌ యూజర్‌‌‌‌. ఇతడు కూడా ‘టీమ్‌‌07’ మెంబర్‌‌‌‌గా ఉన్నాడు. ఎక్కువగా గ్రూప్‌‌ వీడియోలు చేస్తుంటాడు. హుస్సేన్‌‌ ఖాన్‌‌, ఫైజల్‌‌ షేక్‌‌తో కలిసి కామెడీ వీడియోలు కూడా చేశాడు. ప్రస్తుతం 9 మిలియన్ల ఫాలోవర్స్‌‌ ఉన్నారు. ఫ్యాషన్‌‌ స్కిల్స్‌‌, డ్రెస్సింగ్‌‌ సెన్స్‌‌, ఫిట్‌‌నెస్‌‌ వంటి వాటిపై ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఎక్కువగా పోస్టులు చేస్తుంటాడు.

Latest Updates