‘సిరీల్‌‌ ​చాలెంజ్’: ఒకరి నోట్లో నుంచి మరొకరు తినుడట

సోషల్ మీడియాలో ‘సిరీల్‌‌ ​చాలెంజ్’ ట్రెండింగ్ 

ఒకరి నోట్లో ఉన్న ఫుడ్డును తీసుకుని తింటారా..? అబ్బే యాక్‌‌.. ఇదేం ప్రశ్న.. ఎవడైనా అట్ల తింటడా..? అని అంటారా? కానీ, ఇప్పుడు టిక్‌‌టాక్‌‌లో అదో చాలెంజ్‌‌ అయిపోయిందండీ బాబు. అవును, ఐస్​బాకెట్ ​చాలెంజ్, బాటిల్​ క్యాప్​ చాలెంజ్‌‌ల లాగే ఇప్పుడూ ‘సిరీల్‌‌ చాలెంజ్‌‌’ అనే ఇంకో కొత్త చాలెంజ్‌‌ తెరపైకి వచ్చింది.ఇప్పుడిది టిక్​టాక్​లో​ట్రెండింగ్​లో ఉంది. ట్విట్టర్ సహా ఇతర సోషల్​ మీడియాలకూ విస్తరించింది. అసలేంటీ చాలెంజ్ అంటే… ఒకరి నోట్లో మిల్క్, సిరీల్స్ పోయాలి. వాటిని అతడు లేదా ఆమె మింగకూడదు. అతని నోట్లోని సిరీల్స్‌‌ను స్పూన్​తో తీసుకొని మరో వ్యక్తి తినాలి. పార్టనర్ ​నోరు మూసే లోపల ఇది కంప్లీట్ ​చేయాల్సి ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా.. ఇప్పుడిది బాగా వైరల్​అవుతోంది. కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ చాలా మంది ఈ చాలెంజ్​ను స్వీకరిస్తున్నారు. సెలబ్రిటీలు సహా సామాన్యుల వరకు అందరూ చేస్తున్నారు. యూట్యూబ్ స్టార్​ బ్రెట్​ మెన్​రాక్, యూఎస్​కు చెందిన యాక్టర్​ రోనీ బ్యాంక్స్​ ఈ చాలెంజ్​ స్వీకరించి విఫలమయ్యారు. ఈ వీడియోలు సోషల్​మీడియాలో వైరల్​అయ్యాయి. మరికొంత మంది తమ పెట్స్​తో కలిసి ఈ చాలెంజ్​ చేస్తున్నారు. అయితే ఈ చాలెంజ్​తో ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చెస్ట్ ఇన్​ఫెక్షన్స్ వస్తాయని, న్యూమోనియాకు దారితీస్తుందని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు..

కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!

ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పు ఇచ్చే.. హెల్త్‌‌ లోన్​ కార్డ్‌‌ 

రెండేళ్ల పిల్లాడికి 102 ఏళ్లు.. నాలుగేళ్ల పిల్లాడికి 104 ఏళ్లు

‘కరోనా’ వైరస్‌… ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది

Latest Updates