మారాల్సింది నేను కాదు.. ఎదుటివాళ్లు: లోపాన్ని జయించిన టిక్​టాక్​ స్టార్​‌..

కళ్లతోనే వెయ్యి భావాలు పలికిస్తుంది. ఎంతటి డైలాగ్​ అయినా​ చక్కగా చెప్పేస్తుంది. సెంటిమెంట్​, లవ్​, కామెడీ ఏదైనాసరే.. యాక్టింగ్​తో ఆకట్టుకుంటుంది. ఇదంతా ఏ హీరోయిన్​ గురించో అనుకుంటున్నారా..? కానే కాదు. కేరళలోని డిఫరెంట్లీ ఎబుల్డ్​ పర్సన్​ చాందిని నాయర్​ గురించి. తన లోపాన్ని మరిచి, టిక్​ టాక్​ వీడియోలు చేస్తూ స్టార్​గా మారింది.

నా లాంటి ‘‘డిఫరెంట్లీ ఎబుల్డ్​ పర్సన్స్​​ చాలామంది ఉంటారు. అందుకే ఆ విషయాన్ని మరిచి భవిష్యత్తుపై దృష్టిపెట్టేదాన్ని. వైకల్యం కారణంగా చిన్నప్పుట్నుంచే ఎన్నో ఇబ్బందులు పడ్డా. ​సూళ్లలో అడ్మిషన్​ కూడా దొరకలేదు. ఎన్నో స్కూళ్లు ‘నో’ చెప్పాయి. నాలాంటివాళ్లే చదువుకునే స్కూళ్లో అడ్మిషన్​ దొరికింది. పెరిగి పెద్దయ్యాక కూడా ఇబ్బందులు తప్పలేదు. ఇంటర్​లో 90 శాతం పర్సెంటేజీ తెచ్చుకున్నా.. అయినా ఇబ్బందులు తప్పలేదు. కండరాల బలహీనత వల్ల చిన్నప్పట్నుంచే వీల్​చైర్​కే పరిమితం. ఈ ఒక్క కారణంతోనే అడ్మిషన్​ ఇవ్వలేదు. మారాల్సింది నేను కాదు.. లోపాన్ని సాకుగా చూపే ఎదుటివాళ్లు అని తెలుసుకున్నా. ఎన్నో అడ్డంకులు దాటుకొని ఫార్మసీలో డిగ్రీ చేస్తున్నా.

హాబీగా మొదలై..

నాకు చిన్నప్పట్నుంచే పాటలు పాడటం అంటే ఇష్టం. టీవీలో ప్లే అయ్యే సాంగ్స్​ను మ్యూట్​లో పెట్టి, హమ్​ చేసేదాన్ని. ఎన్నో పాటలు పాడా. నా టాలెంట్​ను గుర్తించి పేరెంట్స్​ ఎంకరేజ్​ చేశారు. అలా పాటలపై ఇష్టం పెంచుకొని క్లాసికల్​ సింగింగ్​ నేర్చుకున్నా. ఎంతో టాలెండ్​ ఉండి కూడా నా డిజేబిలిటీ కారణంగా స్టేజీ షోలు చేయలేకపోయా. పాటలపై ఇష్టం చంపులేకపోయేదాన్ని. ‘డబ్​స్మాష్​’ యాప్​ నన్ను వెలుగులోకి తెచ్చింది. ఆ యాప్​ నాకు చాలా బాగా నచ్చింది. ముప్పై సెకన్లు నిడివి ఉన్న వీడియోలు చేసి సోషల్​ మీడియాలో పెట్టేదాన్ని. ‘వెరైటీ మీడియా’  ఫేస్​బుక్​ పేజ్​లో పోస్టు చేసేదాన్ని. నా వీడియోలు నచ్చి చాలామంది షేర్​ చేసేవాళ్లు. అదే నా లైఫ్​కు టర్నింగ్​ పాయింట్​ అయ్యింది. నాలుగు రోజుల్లోనే నాలుగు మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. వీడియో మేకింగ్​లో ఫేస్​ మాత్రమే కవర్​ చేసేదాన్ని. చాలామందికి నేను డిజేబుల్డ్​​ అనే విషయం కూడా తెలియదు. లోకల్​ మీడియా నన్ను గుర్తించడంతో వీడియోలకు బాగా రెస్పాన్స్​ వచ్చింది. లాస్ట్​ ఇయర్​ నుంచి యాక్టివ్​గా వీడియోలు చేస్తున్నా. వీడియోలన్నీ వైరల్​గా మారడంతో 7.7 వేల ఫాలోవర్స్​ ఉన్నారు.

నేను పుట్టింది కేరళ అయినా, పెరిగింది మాత్రం తమిళనాడులో. నా లోపం గురించి తెలిసి చాలామంది జాలి చూపేవాళ్లు. అమ్మానాన్న మాత్రం మామూలు చైల్డ్​గానే పెంచారు. నాకు ఫ్రీడం ఇచ్చారు. వాళ్ల వల్లే నా హాబీ కొనసాగింది. జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది. టిక్​టాక్​ వీడియోలు చేస్తూనే, స్టడీస్​ కంటిన్యూ చేస్తున్నా. డాక్టర్​ కావడమే లక్ష్యం” అంటూ జర్నీ గురించి చెప్పింది చాందినీ నాయర్​.

Latest Updates