సరదాగా చేసిన టిక్ టాక్ వీడియో నిజమైంది

ఇదే నా చివరి సెల్ఫీ అంటూ టిక్ టాక్ : యువకుడు మృతి

విజయనగరం : న్యూ ఇయర్ ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బైబై 2019.. ఈ ఏడాది ఇదే నా చివరి వీడియో అంటూ ఓ యువకుడు టిక్ టాక్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అదే చివరికి నిజమైంది. విజయనగరం జిల్లా బొందపల్లి మండలం కొత్తవలసకు చెందిన వినోద్ 2019 సంవత్సరంలో ఇదే నా చివరి సెల్ఫీ అని టిక్ టాక్ వీడియోను పోస్ట్ చేశాడు.

తరువాత మిత్రులతో కలిసి బైక్ పై వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వినోద్ మృతి చెందాడు. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అప్పటి వరకూ సరదాగా గడిపిన తోటి స్నేహితులు … మిత్రుడి మరణ వార్తతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే చివరి సెల్ఫీ అని సరదాగా అన్న మాటలే నిజమయ్యాయని బోరున ఏడ్చారు.

Latest Updates