గన్ తో టిక్ టాక్ వీడియో: అరెస్ట్ చేసిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్: గన్ తో టిక్ టాక్ వీడియో చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉత్తర ప్రదేశ్ లోని హాపూర్ లో ఓ వ్యక్తి లోకల్ మేడ్ గన్ తో గాల్లోకి కాల్పులు జరిపి టిక్ టాక్ వీడియో చేశాడు. దీంతో ఆ వీడియో నెట్ లో వైరల్ అయింది.  సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.

హాపూర్ ఎస్పీ సంజీవ్ సుమన్ మాట్లాడుతూ… టిక్ టాక్ వీడియోలో గన్ తో ఫైరింగ్ చేసిన అతన్ని పట్టుకుని విచారించామని. గన్ ఎక్కడ లభించిందో కనుక్కుంటున్నామని చెప్పారు. అయితే వీడియో తీసిన వ్యక్తిని, అక్కడే ఉన్న మరో వ్యక్తి  కోసం వెతుకుతున్నామని తెలిపారు.

Latest Updates