టిక్​టాక్​ ‘స్వచ్ఛ భారత్​’

టిక్​టాక్​.. ఆఫీసులు, ఇళ్లు ఎక్కడపడితే అక్కడ యువత వీడియోలు చేస్తూ దాని మోజులో పడిపోయింది. జస్ట్​ ఎంటర్​టైన్మెంట్​ కోసం తీసుకొచ్చిన యాప్​ ఇది. అయితే, కొద్ది రోజుల క్రితం దానిని బ్యాన్​ చేశారు. ప్రైవసీ, చైల్డ్​ పోర్నోగ్రఫీకి అది ఊతమిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే దానిని కొన్ని చోట్ల నిషేధించారు. అన్ని విమర్శలు ఎదుర్కొన్న టిక్​టాక్​.. మొదటి సారి మంచి పనిని భుజానికెత్తుకుంది. భూమి అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛ భారత్​ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోనుంది. టిక్​టాక్​ యూజర్లకు క్లీన్​ ఇండియా చాలెంజ్​ను విసిరింది. #CleanIndia హాష్​ట్యాగ్​తో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతోంది. ఇందులో భాగంగా ‘భూమి’ దేశంలోని వివిధ నగరాల్లో ప్రచార కార్యక్రమాలనూ నిర్వహించనుంది. ఈ మిషన్​లో పాల్గొనేలా టిక్​టాక్​ యూజర్లను ప్రోత్సహించనుంది. ఆగస్టు 2 నుంచి అక్టోబర్​ 2 దాకా 30కిపైగా నగరాల్లో 100కు పైగా కార్యక్రమాలను నిర్వహిస్తామని భూమి పేర్కొంది.

Latest Updates