‘టిక్ టాక్’ లో కేసీఆర్ ను తిట్టాడని.. స్టూడెంట్ అరెస్ట్

టిక్ టాక్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఓ విద్యార్థిని అరెస్ట్ చేశారు.. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు. తెలంగాణ రాష్ట్రం పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై  టిక్ టాక్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన.. కృష్ణా జిల్లాకు చెందిన తగరం నవీన్ అనే డిగ్రీ విద్యార్థిని, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ నాయకుడు రామ్ నర్సింహ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితున్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు రాచకొండ సీపీ. మిత్రులతో కలిసి తిరువూరు లో పార్టీ చేసుకునే సమయంలో ఈ టిక్ టాక్ వీడియో తీసినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు.

Latest Updates