ఒక్క వీడియో మిలియన్ ఫాలోవర్స్

సరదాగా చేసిన ఓ డాన్స్​ వీడియో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. మిలియన్​  ఫాలోవర్స్​తో సెలబ్రిటీని చేసింది.  ​ప్రెజెంట్  టాక్​ ఆఫ్​ది టిక్​టాక్​  అయిన ఆమె పేరు  మమతావర్మ. ఫంక్షన్లు, చిన్నచిన్న ఈవెంట్స్​​లో రోజుకి మూడొందల రూపాయలకు వంటచేసే  మమత ప్రస్తుతం టిక్​టాక్​ సెన్సేషన్​. అదిరిపోయే డాన్స్​ మూమెంట్స్​తో లక్షల్లో లైక్స్​ కొల్లగొడుతున్న  ఈమె గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది మమతవర్మ. నాలుగేళ్ల వయసులోనే తండ్రిని  కోల్పోయింది. దాంతో మమతతో పాటు ఐదుగురి తోబుట్టువుల పోషణ భారం తల్లిపై పడింది. పిల్లలకి మూడు పూట్ల అన్నం పెట్టడానికి ఫంక్షన్లలో వంటమనిషిగా పనిచేసేది మమత తల్లి.  అక్కడ మిగిలిన వాటితో  పిల్లల కడుపునింపేది. పేదరికం అడుగడుగునా అడ్డుపడ్డా పిల్లలకు చదువు చెప్పించే విషయంలో కాంప్రమైజ్​ కాలేదు ఆమె. వాళ్లకి తనలాంటి జీవితం రాకూడదనుకుంది. ఎంత కష్టమైనా పిల్లల్ని చదివించింది. ‘ఇల్లు గడవడమే కష్టమవుతుంటే చదువు ఎందుకని’ ఇరుగుపొరుగు ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా పిల్లల్ని బడికి పంపింది.

తల్లి కోరికకు తగ్గట్టుగానే మమత ఆలోచనలుండేవి. బాగా చదువుకుని  పెద్ద ఉద్యోగం చేసి తల్లిని బాగా చూసుకోవాలనుకునేది మమత. ఆ కలని నిజం చేసుకోవడానికి ప్రతిరోజూ 22 కిలోమీటర్లు ప్రయాణించి పక్క ఊళ్లో ఉన్న  కాలేజీకి వెళ్లేది. పేద కుటుంబం అవడంతో  ఛార్జీకి కూడా డబ్బులుండేవి కాదు. అయినా సరే  చదువుని వదిలేయకుండా సెలవుల్లో పనికెళ్తూ తన చదువుకయ్యే మొత్తం ఖర్చుని ఆమే సంపాదించుకుంటూ డిగ్రీ పూర్తిచేసింది. కానీ, రానురాను ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో కుటుంబ అవసరాల కోసం చదువుని వదిలేసి ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టింది. చిన్నప్పట్నుంచి చదువులో ముందుండటంతో  మంచి ఉద్యోగాలే వచ్చాయి. వాటిలో చేరదామనుకునే సరికి తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పెళ్లిచేసుకోవాల్సి వచ్చింది.

టర్నింగ్​ పాయింట్

తల్లిని కష్టపెట్టడం ఇష్టం లేక పెళ్లికి అడ్డుచెప్పలేదు మమత. ఓ ప్రైవేట్​ కంపెనీలో సెక్యూరిటీగార్డ్​గా పనిచేస్తున్న వ్యక్తిని పెళ్లిచేసుకుని అత్తారింటికెళ్లింది. కానీ, అక్కడా అదే పేదరికం. కూతురు పుట్టాక ఖర్చులు ఇంకా పెరిగాయి. దాంతో పనిచేయడం మొదలుపెట్టింది. చిన్నచిన్న ఫంక్షన్లలో వంటమనిషిగా పనిచేస్తోంది. అలా రోజుకి  300 రూపాయలు సంపాదిస్తూ ఆ డబ్బులో కొంత కూతురి భవిష్యత్తు కోసం సేవ్​ చేసేది.  అలా సాగిపోతున్న  మమత లైఫ్​ని టర్న్​ చేసింది డాన్సింగ్ రియాలిటీ షో  ‘డాన్స్​ ప్లస్’. ఒకరోజు సరదాగా కూతురితో కలిసి షో చూస్తుంటే  పార్టిసిపెంట్ ఒకరు రోబోటిక్​ మూమెంట్స్​ చేస్తూ కంటపడ్డాడు. ఈ డ్యాన్స్ ఫార్మాట్​ కాస్త కొత్తగా అనిపించడంతో నెక్ట్స్​ డే మమత ట్రై చేసింది. భర్త బాగుందని మెచ్చుకోవడంతో టిక్​టాక్​లో పోస్ట్​ చేసింది.

వైరల్ అయ్యింది

పోస్ట్ చేసిన  కొద్దిసేపటికే వీడియో బాగా వైరలైంది. గంటలోనే  ఆరువేల లైక్స్​తో పాటు మూడు లక్షలమంది ఫాలో అయ్యారు. మమత డాన్సింగ్ మూమెంట్స్​కి ఫిదా అయ్యి  చాలామంది పెద్ద మొత్తంలో ఆ వీడియోని షేర్​ చేశారు.  కొద్దిరోజుల్లోనే సెలబ్రిటీ అయింది మమత. ఆ వీడియో ఇచ్చిన బూస్ట్​తో మరిన్ని డాన్స్​ వీడియోలు  పోస్ట్ చేసింది. అవి కూడా బాగా వైరలై  తన ఫాలోవర్స్​ లిస్ట్​ వన్​ మిలియన్​కి చేరింది.

ఉన్నట్టుగానే…

ప్రస్తుతం డాన్స్​ వీడియోలతో పాటు కొన్ని ఫన్నీ వీడియోలతో కూడా ఫ్యాన్స్​ని పలకరిస్తోంది మమత. రిచ్​ బ్యాక్​గ్రౌండ్​, మేకప్​ లుక్స్​ లేకుండా నేచురల్​గా మమత టిక్​టాక్​ వీడియోలు ఉండటంతో రోజురోజుకి తన ఫాలోవర్స్​ లిస్ట్ పెరుగుతోంది.  యాడ్స్​ రూపంలో డబ్బులు కూడా వస్తున్నాయి. వాటన్నింటినీ కూతురి భవిష్యత్తు కోసం దాచిపెడుతోంది మమత. అంతేకాదు ఇంత స్టార్​డమ్​ వచ్చినా ఒకప్పుడు  కుటుంబం కడుపునింపిన  వంటని మాత్రం వదలట్లేదు.

అవకాశం రావాలంతే

‘‘మనదేశంలో టాలెంట్​కి కొదవ లేదు. అది ప్రదర్శించడానికే సరైన అవకాశం కావాలి. ఒకవేళ వచ్చినా ఎవరేమనుకుంటారోనని చాలామంది హౌస్​వైఫ్స్​ వెనకడుగేస్తున్నారు. నేనూ మొదట్లో అలానే అనుకునేదాన్ని. పేదకుటుంబం అవడంతో ఊళ్లో వాళ్లు ఏమనుకుంటారోనని కూడా ఆలోచించేదాన్ని. అసలు నన్ను ఎవరు చూస్తారనే ఆలోచనలు కూడా వచ్చేవి. కానీ , నా భయాలన్నింటిని దూరం చేసింది నా ఫస్ట్ టిక్​టాక్​కి వచ్చిన రెస్పాన్స్’’​

https://vm.tiktok.com/wQobPa/

Latest Updates