ప్రపంచంలో నంబర్‌ వన్‌ కుబేరుడి ఆస్తి 26 కిలోలు!

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ అందరికీ తెలుసుగా. అదేనండి.. ప్రపంచంలో నంబర్‌ వన్‌ కుబేరుడు.  అవును, అదేంటీ ఆయన ఆస్తి కొన్ని లక్షల కోట్లు కదా. ఈ కిలోల కథేంటి అని కన్ఫ్యూజ్​ అయ్యారా?  ఆయన ఆస్తిలో ఏ మాత్రం తేడా లేదు. కానీ, ఆ లెక్కింపులోనే తేడా ఉంది. ఓ టిక్‌టాక్‌ స్టార్‌ ఆయన ఆస్తిని వెరైటీగా లెక్కబెట్టాడు. బియ్యంతో కొలిచి చూపించాడు. అలా లెక్కబెడుతూ చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇంకేముంది మస్తు వైరలైంది. ఆ టిక్‌టాక్‌ స్టార్‌ పేరు హంఫ్రీ యాంగ్‌. ఇంతకీ ఆయనేం చేశాడో తెలుసా. లక్ష డాలర్లకో బియ్యం గింజ చొప్పున లెక్కించాడు. అంటే కోటి డాలర్లకు వంద గింజలు, 1 బిలియన్‌ డాలర్లకు పది వేల గింజలన్నమాట. అలా ఆ పదివేల గింజల్ని బరువు కొలిచాడు 215 గ్రాములొచ్చాయి. మరి జెఫ్‌ ఆస్తి 122 బిలియన్‌ డాలర్లు. అంటే 26 కిలోల 230 గ్రాములు. ఫస్ట్‌ బిలియన్‌ డాలర్లకు 215 గింజల్ని లెక్కించి ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. అది బాగా వైరలైన తర్వాత మొత్తం లెక్కతో రెండో వీడియో అప్‌లోడ్‌ చేశారు.

Latest Updates