గరుడ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు బుధవారం ఉదయం మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకీలో దర్శనమిచ్చిన  శ్రీనివాసుడు.. సాయంత్రం గరుడ వాహనంపై కొలువు దీరారు. సీఎం జగన్‌, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వామి వారి వాహనసేవలో పాల్గొన్నారు. కరోనా వైరస్ కారణంగా ఆలయంలోని కల్యాణ మండపంలోనే అర్చకులు శ్రీవారి వాహన సేవలు నిర్వహిస్తున్నారు.

అంతకుముందు శ్రీవారికి ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం జగన్‌ పర్యటన క్రమంలో తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు.

Latest Updates