వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ (శుక్రారం) శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుచ్చి సేవను ఘనంగా నిర్వహించారు. బంగారు తిరుచ్చిపై శ్రీదేవి , భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. అర్చకులు,ఈవో జవహర్ రెడ్డి కంకణధారణ చేశారు.  తర్వాత ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో ఉత్సవాలకు సంబంధించిన వైదిక కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కరోనా కారణంగా శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని TTD ఆలయాధికారులు నిర్ణయించారు.

Latest Updates