జూన్ 8 నుంచి శ్రీవారి ఆలయాన్ని తెరిచే అవ‌కాశం

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌క‌టించిన ‌లాక్ డౌన్ 5.0లో నిబంధనలను చాలావ‌ర‌కు సడలించింది. ఈ క్ర‌మంలో, జూన్ 8వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దశలవారీగా ఇప్పటికే పూర్తి చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. అరకొర ఏర్పాట్లు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్దేశిత గడువు నాటికి కొన్ని ఆంక్షలతో తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల రాకకు అనుమతించనుంది. ఇప్పటికే భక్తులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు జరిగిపోయాయి. క్యూలైన్లను జిగ్ జాగ్ చేశారు. అలిపిరి, కాలి నడక మార్గాల్లో భక్తులకు వైద్య పరీక్షలు చేసిన తరువాతనే కొండపైకి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.

దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారా ఇతర ప్రార్థనా మందిరాలను జూన్ 8వ తేదీ నుంచి భక్తుల కోసం తెరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఫలితంగా- అదేరోజున తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రాకను పునరుద్ధరించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేపట్టారు.

ttd

Latest Updates