ఈ నెల 8 వ‌ తేది నుంచి శ్రీవారి దర్శనానికి ట్రయల్ రన్

తాడేపల్లి: తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనానికి భక్తుల‌ను అనుమతినిస్తూ మంగళవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు ఈనెల 8 వ తేది నుంచి శ్రీవారి దర్శనానికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామ‌ని టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. మూడు రోజులు పాటు భౌతిక దూరం పాటిస్తూ టీటీడీ ఉద్యోగులు, స్థానికులకే దర్శనానికి అనుమ‌తినిచ్చామ‌న్నారు. మూడు రోజులు తర్వాత అధికారుల సూచనల మేరకు భక్తులకు ద‌ర్శ‌న అవకాశం క‌ల్పిస్తామ‌ని చెప్పారు

ప్రతి భక్తుడు భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ చేసుకోవాలని ఛైర్మ‌న్ తెలిపారు. ఆన్ లైన్ లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న వారికి అనుమతి ఇస్తామ‌ని చెప్పారు. ఆన్ లైన్ బుకింగ్ చేసుకొని భక్తులకు అలిపిరి వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దర్శనానికి అనుమ‌తివ్వ‌నున్నారు. అలిపిరి వద్ద థర్మల్ స్క్రీనింగ్ తర్వాతనే తిరుమలకు భక్తులు అనుమతినిస్తామ‌ని తెలిపారు. కరోన నేపధ్యం లో తిరుమల శ్రీవారి పుష్కరిణిలో స్నానానికి భక్తులు కు అనుమతి లేద‌న్నారు. శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలలు నుంచి భక్తులు రానున్న నేపథ్యంలో కేంద్రం సూచించిన మార్గదర్శకాలు పాటించాలని చెప్పారు.

Latest Updates