మార్చి 16 నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు

ఫైల్ ఫొటో

తిరుమలలో మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తెప్పోత్సవాలను ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ‌వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై విహరిస్తారు.

ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామి కోనేరులో తెప్పపై తిరుగాడుతారు. మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు చొప్పున తిరిగిభక్తులకు కనువిందు చేస్తాడు కోనేటిరాయుడు.

సేవల రద్దు

తెప్పోత్సవాలు జరిగే రోజుల్లో కొన్ని సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మార్చి 16, 17వ తేదీల్లో వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు జరగవని చెప్పింది. మార్చి 18, 19, 20వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చే్స్తున్నట్లు ప్రకటించింది.

Latest Updates