నా భర్త నన్ను కాపాడి నీళ్లలో మునిగిపోయాడు..

అందమైన కుటుంబం. అమ్మా, నాన్న, ఓ చిన్నారి. ఎంతో ఆనందంగా గోదావరి అందాలను, పాపికొండలను చూసేందుకు తిరుపతి నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. గోదావరిలో జరిగిన లాంచీ ప్రమాదం… ఆ కుటుంబంలో  పెను విషాదాన్ని నింపింది. తిరుపతి చెందిన సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ప్రమాదంలో గల్లంతయ్యారు. తిరుపతి  అక్కారంపల్లికి చెందిన… మధులత ప్రాణాలతో బయట పడగా… ఆమె భర్త సుబ్రమణ్యం, కుమార్తె హాసిని గల్లంతయ్యారు. నీటిలో మునిగిన తనను… కాపాడి తమ భర్త మునిగిపోయాడని కన్నీరు పెట్టుకుంటుంది మధులత.

గాలింపులో చిన్నారి హాసిని డెడ్ బాడీని బయటకు తీశారు NDRF సిబ్బంది. ప్రస్తుతం  పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో పంపించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు,  ఫ్రెండ్స్ తో పాటు పాప చదువుతున్న స్కూల్ టీచర్లు కన్నీరు పెట్టుకుంటున్నారు. హాసిని క్షేమంగా తిరిగి వస్తుందనుకున్నామని…. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates