మద్యం దుకాణాలు, బ్యాంకులు కూడా మూయాల్సిందే

కరోనా తీవ్రత నేపథ్యంలో తిరుపతిలో మద్యం దుకాణాలు, బ్యాంకులు కూడా మూయాల్సిందేనని కలెక్టర్ సూచించారు. అంతేకాకుండా.. ఉదయం 11 గంటల తర్వాత  బయట తిరిగితే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తిరుపతిలో నగరంలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో.. నేటి నుంచి వచ్చే నెల ఆగష్టు 5 వరకు అధికారులు లాక్‌డౌన్‌ ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 5,386 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క తిరుపతిలోనే 2,572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో నగర ప్రజలలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో 50 వార్డుల్లో ఒక్కోదాంట్లో 20 కేసులు దాటాయని.. మరి కొన్నింట్లో 40 కేసులు కూడా నమోదయ్యాయని కలెక్టర్‌ భరత్ నారాయణ గుప్తా తెలిపారు. నగరమంతా కంటైన్‌మెంట్‌ జోన్‌గా మారిందని ఆయన అన్నారు. నగరంలో అన్ని వ్యాపారాలకు ఉదయం 11 గంటల వరకే అనుమతి ఉంటుందన్నారు. ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, పాల కేంద్రాలు మాత్రం తెరచే ఉంటాయన్నారు. మద్యం దుకాణాలు, బ్యాంకులు సహా అన్నింటినీ మూసి వేయాల్సిందేనని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాళహస్తిలో 45 రోజులపాటు పూర్తి లాక్‌డౌన్‌ విధించడం వల్ల సత్ఫలితాలు వచ్చాయన్నారు. తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉదయం 11 గంటల తర్వాత ఉద్యోగులు మినహా ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దని ఆయన కోరారు. భక్తులు తిరుమల వెళ్లేందుకు బస్సులు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

For More News..

పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మాహత్యాయత్నం

కేసీఆర్.. జగన్‌తో ‌‌‌కుమ్మక్కయ్యావా?

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మృతి

Latest Updates