పట్టాలు తప్పిన తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్‌

తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఇవాళ ఉదయం పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లా రైల్వే కోడూరు స్టేషన్‌ దగ్గర ఆ రైలు పట్టాలు తప్పింది.  అలర్టైన డ్రైవర్‌ వెంటనే రైలును నిలిపివేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి నుంచి షిర్డీ వెళ్తుండగా ఇంజన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగీ పట్టాలు తప్పాయి. విషయం తెలుసుకున్న అధికారులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలం దగ్గరకు చేరుకున్నారు. మరమ్మతు చర్యలు చేపట్టారు. రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Latest Updates