ఐడియా అదిరింది: కరోనా పెషెంట్ తో పబ్లిక్ ను పరుగులు పెట్టిస్తున్న పోలీసులు

టైటిల్ చూసి అదేంటి..కరోనా పెషెంట్ తో పబ్లిక్ ను కట్టడి చేయడం దారుణం, ఆస్పత్రిలో జాయిన్ చేయించొచ్చు కదా అని మీరు  అనుకోవచ్చు.

పోలీసులు, హెల్త్ డిపార్ట్ మెంట్, మున్సిపాలిటీ, వాలంటీర్లు ఇలా అన్నీ విభాగాలకు చెందిన ఉద్యోగులు కరోనా వైరస్ నుంచి పబ్లిక్ ను కాపాడేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు. కుటుంబాల్ని విడిచి రోజుల తరబడి కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.

అదే సమయంలో పబ్లిక్ మాత్రం లాక్ డౌన్ ను ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి.

ఓ వైపు పబ్లిక్ ను కట్టడి చేస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తమిళనాడు పోలీసులు అదిరిపోయే ఐడియాతో అనవసరంగా రోడ్ల మీద తిరుగుతున్న పబ్లిక్ భరతం పడుతున్నారు. అదెలా అంటారా..?

తమిళనాడు తిర్పూర్ పోలీసులు ప్రధాన కూడళ్లల్లో అంబులెన్స్ లు ఏర్పాటు చేశారు. రోడ్ల మీద తిరుగుతున్న పబ్లిక్ ను క్వారంటైన్ కు తరలిస్తున్నారు.  అయితే అంబులెన్స్ ఎక్కేందుకు పలువురు వాహనదారులు భయపడుతున్నారు. అంబులెన్స్  లోపల కరోనా పేషెంట్ కు సూట్ ధరించిన విధంగా  ఓ వ్యక్తికి సూట్ తగిలించి పడుకోబెట్డారు. ఆ వ్యక్తిని చూసి  అంబులెన్స్ ఎక్కడానికి భయపడి పారిపోతున్నారు. మరోసారి బయటికి రామని పోలీసులను వేడుకుంటున్నారు. క్షమించమని ప్రాదేయ పడుతున్నారు. ఇదంతా కేవలం‌ టైమ్ పాస్ కోసం రోడ్ల పైకి వస్తున్న వారిని కట్టడి చేయడానికే అంటున్నారు పోలీసు అధికారులు.

Latest Updates