ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు ఊడబీకటం ఎవని తరం కాదు: కోదండరాం

ప్రైవేటు వ్యక్తులతో కలిసి సీఎం కేసీఆర్ ఆర్టీసీని సమాధి చేసేందుకు రెడీ అవుతున్నారని ఆరోపించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఈ రోజు ప్రెస్ క్లబ్ లో మట్లాడిన ఆయన…  పండుగ ముందు సమ్మె జరగొద్దనే సోయి కేసీఆర్ కు ఉండాలన్నారు. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ఉద్యమ ద్రోహులైన అప్పటి లీడర్లు ఇప్పటి మంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి ఒక్కడే ఉన్నడని… సమాజం మొత్తం ఆర్టీసీ కి మద్దతు ఇస్తుందని చెప్పారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చుడు సులభం కానీ…  ఊడపీకటం ఎవని తరం కాదని… సమ్మె చేస్తున్న వాళ్లకు ప్రభుత్వం ముందుగా నోటీసు ఇవ్వాలని..  చేసిన నేరాన్ని బట్టే శిక్ష ఉంటదని… ఏ చిన్న నేరానికైనా ఉద్యోగాన్ని తీయలేరని అన్నారు. దేశ ద్రోహం చేసినప్పుడు తప్ప… నోటీసు ఇవ్వకుండా ఉద్యోగాన్ని తీసేయలేరు.. ఇది ఏ ప్రజాస్వామ్యం ఒప్పుకోదు… ప్రజాస్వామ్యం లో విచారణ లేని శిక్ష ఉండనే ఉండదని అన్నారు. ముఖ్యమంత్రి నేనే చట్టం, నేనే రాజ్యంగం అని అనుకుంటున్నరని చెప్పారు.

ఎర్ర మంజిల్ విషయంలో ఎలా అయితే కేసీఆర్ బంగపడ్డాడో.. ఆర్టీసీ విషయంలో అలాగే బంగ పడ్తడని అన్నారు కోదండరాం. ఇప్పుడు గనుక ప్రజలు, మిగితా ఉద్యోగ సంఘాలు నిద్రలేవకపోతే… భవిష్యత్తులో అందరూ అన్యాయం అయితరని అన్నారు. ఆర్టీసీ లేకపోతే ఆర్థిక వ్యవస్థ లేదు.. ఇది గుండె లాంటిదని చెప్పారు ఆర్టీసీని నిలబెట్టుకునేందుకే కార్మికులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. PRC అడిగితే ఉద్యోగులకు కూడా ఆర్టీసి కార్మికులకు జరిగినట్టే జరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Latest Updates