అన్ని స్థానాల్లో పోటీ: పరిషత్ ఎన్నికల బరిలో TJS

వెలుగు: అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ వెల్లడించారు. కల్వకుర్తిలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు రైతులు,ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయన్నారు. ఇప్పటికీ రైతులకు పాస్ బుక్కులు, రైతుబంధు చెక్కులు అందలేదని విమర్శించారు. పెండింగ్ లో పెట్టిన పాస్ బుక్కులను అందజేశాకే రెవెన్యూలో సంస్కరణలు చేపట్టాలన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం వల్లే కల్వకుర్తి ఎత్తిపోతల వెనుకబడిందన్నారు. ప్రాజెక్టల కోసం భూములను కోల్పోయిన రైతులకు 2013 చట్టం ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.

Latest Updates