అంబేద్కర్ విగ్రహం తొలగించడాన్నిఖండిస్తున్నాం: కోదండరాం

TJS president Kodanda ram talk about damaging Ambedkar statue in panjagutta

పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు… తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. రాజ్యాంగ నిర్మాత విగ్రహ ధ్వంసాన్ని.. ప్రజాస్వామిక విలువలపై జరిగిన దాడిగానే చూడాల్సి వస్తుందన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కోదండరామ్.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ అన్నిస్థానాల్లో పోటీ చేస్తుందని కోదండరాం అన్నారు. ఇంటర్ బోర్డు ఫలితాల తప్పుల తడకపై ప్రభుత్వం చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రైతుల పాస్‌బుక్‌లు, చెక్కులు వెంటనే ఇవ్వాలని కోదండరాం కోరారు.

Latest Updates