TJS అగ్గిపెట్టె గుర్తుతో పోటీ చేస్తుంది: కోదండరాం

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో అగ్గిపెట్టె గుర్తుతో పోటీ చేయన్నట్లు తెలిపారు TJS అధినేత కోదండరాం. మున్సిపల్ ఎన్నికల ప్రణాళికలను విడుదల ఆయన… TJS పోటీ చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రజాసమస్యలే ప్రధాన ఎజెండాగా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. నిర్లాక్ష్యానికి గురయిన మున్సిపాలిటీలను తిరిగి పునరుద్ధరించాలని ఆకాంక్షించారు. ప్రజలను ఓట్లు అడిగే పార్టీలు వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పాలని కోదందరాం  ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కలిసి వచ్చే పార్టీలతో హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు కోదండరాం.

Latest Updates