బెంగాల్ లో TMC ఎమ్మెల్యే హత్య

బెంగాల్ లో దారుణం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ MLA సత్యజిత్ బిశ్వాస్ ను దుండగులు కాల్చి చంపారు. నడియా జిల్లాలోని తన నియోజకవర్గం కృష్ణగంజ్ లోని పూల్ బరి గ్రామంలో సరస్వతి పూజకు బిశ్వాస్ హాజరుకాగా… అక్కడే అతడిపై కాల్పులు జరిగాయి. వెంటనే శక్తినగర్ జిల్లా హాస్పిటల్ కు తరలించగా… అప్పటికే బిశ్వాస్ చనిపోయాడని డాక్టర్లు ధృవీకరించారు. ఘటనా స్థలంలో ఓ నాటు తుపాకీని పోలీసులు గుర్తించారు. ఈ హత్య బీజేపీ నేతలే చేశారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే తృణమూల్ అంతర్గత కలహాల వల్లే బిశ్వాస్ హత్య జరిగిందని కౌంటర్ ఇచ్చింది బీజేపీ.

మటువా సామాజిక వర్గానికి చెందిన సత్య జిత్ బిశ్వాస్.. బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఎస్సీ నేత. 2015లో కృష్ణగంజ్(SC) స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి విజయం సాధించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గెలిచారు. సత్యజిత్ వయస్సు 41 ఏళ్లు. ఆయనకు రెండేళ్లకిందే వివాహం జరిగింది.

Latest Updates