బెంగాల్ లో బీజేపీకి బోడిగుండే

TMC will win all 42 Lok Sabha seats in Bengal: Mamata Banerjee

మొత్తం 42 సీట్లు తృణమూల్​కే: మమత

కోల్​కత: బెంగాల్ లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కదని, మొత్తం 42సీట్లు తమ పార్టీనే గెలుచుకుంటుందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, వెస్ట్ బెంగాల్ చీఫ్ మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హౌరా జిల్లాలో టీఎంసీ క్యాండిడేట్ ప్రసన్ బెనర్జీకి మద్దతుగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మమత బీజేపీపై విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల్లో  బెంగాల్​లో రెండు సీట్లు గెలుపొందిన బీజేపీకి ఈసారి గుండుసున్నానే వస్తుందన్నారు. ఇప్పటికే 300 లోక్​సభ స్థానాల్లో ఎన్నికలు ముగిసాయని, రాజస్థాన్, యూపీ, బీహార్, పంజాబ్, గుజరాత్, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయమైందని అన్నారు. ఇక ఆ పార్టీ కన్ను బెంగాల్​పై పడిందని, బీజేపీ..ఆ పార్టీ కోసం పనిచేసే మైండ్​సెట్ ఉన్నవాళ్లని బెంగాల్​ ప్రజలు ఓడించడం సాధారణమేనని అన్నారు.

‘‘అధికారంలోకి రాగానే బెంగాల్​లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్​సిటిజన్​షిప్(ఎన్​ఆర్సీ) అమలు చేస్తామని ఓ వ్యక్తి చెప్పి వెళ్లారు. వాళ్లు అధికారంలోకైతే రానీ.. అప్పుడు చూస్తాం మేముండగా వాళ్లెలా అమలు చేస్తారో’’ అంటూ పేరు వెల్లడించకుండా అమిత్​షా ను ఉద్దేశించి హెచ్చరించారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ఆ పార్టీ విధానాల కారణంగా 12వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ రామ మందిరం గురించి మాట్లాడుతుందని, గడిచిన ఐదేళ్లలో ఆ పార్టీ చిన్న రామ మందిరమైనా నిర్మించిందా? అంటూ ప్రశ్నించారు. ఓట్లడిగేందుకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రం గురించి ఏమీ తెలియదన్నారు. టెర్రరిస్టులకు నిధులు అందుతున్నాయని పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ.. రాబోయే రోజుల్లో డబ్బులుండట్లేవని బ్యాంకులను కూడా మూసేస్తారేమో అని ఎగతాళి చేశారు.

Latest Updates