‘జై శ్రీరామ్’ అన్నందుకు సొంత కార్యకర్తను కొట్టారు

తృణముల్ కాంగ్రెస్ కు చెందిన ఓ కార్యకర్త ‘జైశ్రీరాం’ అని నినాదాలు చేసినందుకు అదే పార్టీకి చెందిన మరో కార్యకర్త అతనిపై దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం వెస్ట్ బెంగాల్ లోని బసిరహట్ అనే గ్రామంలో జరిగింది. రంజిత్ మొండల్ అనే వ్యక్తి నినాదాలు చేయగా తారక్ పరోయి దాడి చేసినట్టుగా పోలీసులు తెలిపారు. బాధితుడు ఒక సారి జై శ్రీరామ్ అని అన్నప్పుడు గమనించిన తారక్ పరోయి.. బాధితుడిని పలు సార్లు వేధించాడని ఆతర్వాత దాడి చేశాడని చెప్పారు. గాయపడిన రంజిత్ ను హాస్పిటల్ లో జాయిన్ చేశారు స్థానికులు. పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితునిపై కేసు నమోదు చేసుకున్నారు. అయితే అతన్ని ఇంకా అరెస్టు చేయలేదు.

Latest Updates